ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టల్‌ తెరవరా?

ABN, First Publish Date - 2022-08-05T04:06:34+05:30

కురుపాం ఏపీ మోడల్‌ స్కూల్‌ బాలికల వసతిగృహం ఇది. పాఠశాలలు తెరుచుకొని నెలరోజులు గడుస్తున్నా.. ఇంతవరకూ హాస్టల్‌ను మాత్రం తెరవలేదు. దీంతో విద్యార్థినులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. మోడల్‌ స్కూల్‌లో విద్యాబోధన సక్రమంగా అందుతుండడంతో విద్యార్థుల చేరికలు పెరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి 100 మంది వరకూ బాలికలు పా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వందలాది మంది విద్యార్థినుల ఎదురుచూపు

కురుపాం ఏపీ మోడల్‌ స్కూల్‌ బాలికల వసతిగృహం ఇది. పాఠశాలలు తెరుచుకొని నెలరోజులు గడుస్తున్నా.. ఇంతవరకూ హాస్టల్‌ను మాత్రం తెరవలేదు. దీంతో విద్యార్థినులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. మోడల్‌ స్కూల్‌లో విద్యాబోధన సక్రమంగా అందుతుండడంతో విద్యార్థుల చేరికలు పెరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి 100 మంది వరకూ బాలికలు పాఠశాలలో చేరారు. కానీ వారి సంబంధించి హాస్టల్‌ తెరవకపోవడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. ఇదేమని సంబంధిత అధికారులను అడుగుతుంటే మరుగుదొడ్లకు సంబంధించి సెప్టిక్‌ ట్యాంకులు నిండిపోవడం వల్లే తెరవలేదని వింత సమాధానం చెబుతున్నారు. వేసవి సెలవుల్లో హాస్టల్‌ నిర్వహణకు సంబంధించి ఎటువంటి సన్నాహాలు చేయకపోవడమే ఇబ్బందులకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీలైనంత త్వరగా హాస్టల్‌ను తెరవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయమై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సుందరరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. సోమవారం నుంచి హాస్టల్‌ను తెరవనున్నట్టు తెలిపారు. 

-కురుపాం



Updated Date - 2022-08-05T04:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising