ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విల్లు ఎక్కుపెట్టి.. లక్ష్యంపై గురిపెట్టి..

ABN, First Publish Date - 2022-10-18T04:34:55+05:30

జిల్లాకేంద్రంగా ఏర్పడిన తర్వాత పార్వతీపురం తొలిసారిగా రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు వేదికైంది. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అట్టహాసంగా క్రీడాపోటీలు ప్రారంభించారు.

పోటీల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఉత్సాహంగా అంతర్‌ జిల్లాల ఆర్చరీ పోటీలు ప్రారంభం

  రాష్ట్ర నలుమూలల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరు 

(పార్వతీపురంటౌన్‌, అక్టోబరు 17) 

  జిల్లాకేంద్రంగా ఏర్పడిన తర్వాత పార్వతీపురం తొలిసారిగా రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు వేదికైంది. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అట్టహాసంగా క్రీడాపోటీలు ప్రారంభించారు. 42వ అంతర్‌ జిల్లాల అర్చరీ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 250 మంది క్రీడాకారుల హాజరయ్యారు. తొలిరోజు ఇండియన్‌ రౌండ్‌ విభాగంలో వివిధ జిల్లాలకు చెందిన వంద మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ రౌండ్‌ పోటీలు సాయంత్రం 4 వరకు జరిగాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తాచాటారు. విల్లు ఎక్కు పెట్టి.. లక్ష్యంపైనే గురిపెట్టి విల్లంబులు వదిలారు. ముందుగా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్‌లో మరికొన్ని క్రీడలు నిర్వహించేందుకు ఈ పోటీలు ఒక వారధిగా నిలుస్తాయన్నారు. అర్చరీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికే దేశంలో అత్యున్నత అర్జున, ద్రోణాచార్య అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. జిల్లా అర్చరీ అసోసియేషన్‌, క్రీడాప్రాఽఽధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడాపోటీల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు, రాష్ట్ర అర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌ సత్యనారాయణ, డీఎస్‌డీవో వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బి.గౌరీశ్వరీ, వైస్‌చైర్మన్లు ఐ.గున్నేష్‌, కె.రుక్మిణి, రాష్ట్ర అర్చరీర కీడల ఆర్గనైజింగ్‌ కార్యదర్శి డీటీ గాంధీ, క్రీడల ఆర్గనైజర్లు ఎం. వాసుదేవరావు, మురళి, 50 మంది కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. 

 


Updated Date - 2022-10-18T04:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising