ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనుల్లేవ్‌ సారూ!

ABN, First Publish Date - 2022-07-19T05:04:23+05:30

జిల్లాలో వలసలు మళ్లీ ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు.

డంగభద్రలో వలసల వల్ల ఖాళీ అయిన గిరిజనవీధి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా నుంచి అధికమవుతున్న వలసలు

సొంతూరిలో ఉపాధి హామీ పనుల్లేక..

అడ్డంకిగా 100 రోజుల పనుల నిబంధన

నలుగురు ఉంటే ఒక్కొక్కరికి 25 రోజులే

( పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వలసలు మళ్లీ ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు. ఉపాధి హామీ పథకంలో నిబంధనల అడ్డంకితో ఏడాదిలో 100 రోజుల పని దినాలే కల్పిస్తున్నారు. దీంతో విశాఖ, గుంటూరు, తూర్పుగోదావరి, విజయవాడ జిల్లాలతోపాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబాయి వంటి మహానగరాలకు పనుల కోసం మూటాముల్లె సర్దుకుని పోతున్నారు. 

  ఇదీ నిబంధన

ఉపాధి హామీ పథకం కింద వందరోజుల పని కల్పించాలన్నది నిబంధన. అయితే జాబ్‌కార్డు యూనిట్‌గా తీసుకుని వందరోజులు కల్పిస్తున్నారు. కుటుంబంలో నలుగు సభ్యులున్నట్లయితే ఒకే జాబ్‌కార్డు అందించారు. అంటే ఒక కార్డుకు వందరోజుల ప్రకారం నలుగురికి 25 రోజులే పని కల్పిస్తున్నారు.  జిల్లాలో  వేలాది మందికి 25 రోజులు మాత్రమే పని దొరుకుతోంది. అంటే నెల కూడా ఉపాధి పని దక్కని పరిస్థితి నెలకొంది. ఏడాదిలో గరిష్ఠంగా రెండు నెలలు ఉపాధి పనుంటే.. మిగిలిన 10నెలలు వేరే పనులను వెతుక్కోవలసిన పరిస్థితి ఉంది. కరోనా తర్వాత ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజు వారీ సరాసరి వేతనం రూ.213 చెల్లిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో 1.62 లక్షల జాబ్‌కార్డులకు సంబంధించి 2.75 లక్షల మందికి పనులను కల్పిస్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది. మొత్తం జాబ్‌ కార్డులు 1.80 లక్షలు ఉన్నాయి.   ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పనులు పెద్దగా జరగడం లేదు.

ఈ గ్రామాల నుంచే వలసలు

ఉమ్మడి జిల్లాలోని బాడంగి, తెర్లాం, బలిజిపేట, భామిని, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ, రామభద్రపురం, దత్తిరాజేరు, వేపాడ, జామి, ఎల్‌ కోట, ఎస్‌ కోట, గంట్యాడ, వంగర, సంతకవిటి, మెరకముడిదాం మండలాల నుంచి వలసలు భారీగా ఉంటున్నాయి. రాయగడ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను చూస్తే వలసల తీవ్రత కనిపిస్తుంది. ఉపాధి హామీ పనులు 150-200 రోజులు కల్పిస్తే వలసలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉపాధి పనులను వ్యవసాయంతో అనుసంధానం చేసినట్లయితే రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది. 

  ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తున్నాం

  ఉపాధి హామీ పథకం కింద అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తున్నాం. గ్రామసభలు  నిర్వహించి పనులు కావలసిన ప్రాప్తికి వివరాలు తీసుకుని ఉపాధి కల్పిస్తున్నాం. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. 

- రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం 




Updated Date - 2022-07-19T05:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising