ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంశధారలో పెరిగిన నీటి ప్రవాహం

ABN, First Publish Date - 2022-07-04T05:23:00+05:30

వంశధారలో నీటి ప్రవాహం పెరిగింది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఒడిశాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆదివారం నదిలో నీటి తీవ్రత ఎక్కువైంది. దీంతో భామిని మండలంలోని తీర గ్రామాల నుంచి ఒడిశాకు పడవ ప్రయాణాలు నిలిచిపోయాయి.

నేరడిలో పెరిగిన వంశధార నదిలో నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిలిచిన పడవ ప్రయాణం

రాకపోకలకు ఇబ్బందులు 

భామిని, జూలై 3: వంశధారలో నీటి ప్రవాహం పెరిగింది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఒడిశాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆదివారం నదిలో నీటి తీవ్రత ఎక్కువైంది. దీంతో భామిని మండలంలోని తీర గ్రామాల నుంచి ఒడిశాకు పడవ ప్రయాణాలు నిలిచిపోయాయి. ఒడిశా తీర గ్రామాలకు వెళ్లాలంటే కొత్తూరు, నివగాం, మాతల మీదుగా 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. బుధవారం నుంచి నేరడి-బి వద్ద నుంచి పడవ అందుబాటులో ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. భామిని మండలం వడ్డంగి, లోహరజోల, గురండి, నేరడి తదితర ప్రాంత ప్రజలు నదిని దాటి.. ఒడిశాలోని ఖండవ రైల్వే స్టేషన్‌ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. రథయాత్ర నేపథ్యంలో పూరీకి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ప్రస్తుతం వంశధారలో నీటి ప్రవాహం అధికం కావడంతో ఎక్కువ మంది బస్సులో హడ్డుబండి వెళ్లి రైలు ఎక్కుతున్నారు.

 

Updated Date - 2022-07-04T05:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising