నిర్మాణం చేయకపోతే పట్టాలు రద్దు చేస్తాం
ABN, First Publish Date - 2022-12-16T23:51:14+05:30
ఇప్పటి వరకు కనీసం పునాదులు కూడా తీయలేని లబ్ధిదారులు పనులు మొదలు పెట్టకపోతే అటువంటి వారి పట్టాలను రద్దు చేయాల్సి ఉంటుందని గృహ నిర్మాణ శాఖాధికారులు లబ్ధిదారులను హెచ్చరించారు.
కొత్తవలస: ఇప్పటి వరకు కనీసం పునాదులు కూడా తీయలేని లబ్ధిదారులు పనులు మొదలు పెట్టకపోతే అటువంటి వారి పట్టాలను రద్దు చేయాల్సి ఉంటుందని గృహ నిర్మాణ శాఖాధికారులు లబ్ధిదారులను హెచ్చరించారు. శుక్రవారం బలిఘట్టాం గ్రామంలో లబ్ధిదారులకు ఇచ్చిన లేఅవుట్‌లోనే అధికారులతో గృహ నిర్మాణ శాఖకు చెందిన ఈఈ శ్రీనివాసరావు, డీఈ శ్రీనివాసన్‌తో పలు శాఖల అధికారులు సమావేశం నిర్వహించారు. బలిఘట్టాం లేఅవుట్‌లో తుమ్మికాల్లి, ముసిరాం, అప్పన్నపాలెం, నిమ్మలపాలెం, బాలిఘట్టాం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పట్టాలను మంజూరు చేశారు. వీరిలో కొంతమంది లబ్ధిదారులు మాత్రమే ఇళ్లను నిర్మాణం చేసుకుంటున్నారు. చాలా మంది లబ్ధి దారులు కనీసం పునాదులు కూడా తీయకపోవడంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టకపోతే పట్టాలను రద్దు చేస్తామన్నారు. లబ్ధిదారులు ఇళ్లను మొదలు పెట్టడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రామచంద్రరావు, వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు, ఉపాధి హామి పధకం ఏపీఎం విజయలక్ష్మిఈఓ పీఆర్‌డీ దర్మారావుతో పాటు విద్యుత్ శాఖాఽధికారి ఇతర శాఖల అధికారులు, తుమ్మికాపల్లి సర్పంచ్ విరోతి కొండలరావు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:51:15+05:30 IST