నవంబర్లో గృహ ప్రవేశాలు
ABN, First Publish Date - 2022-10-18T04:13:24+05:30
జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించి నవంబర్ నాటికి గృహ ప్రవేశాలు అయ్యేలా చూడాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, జలజీవన్ మిషన్ తదితర ప్రాజెక్టులపైనా సోమవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ సూర్యకుమారి
కలెక్టరేట్, అక్టోబరు 17: జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించి నవంబర్ నాటికి గృహ ప్రవేశాలు అయ్యేలా చూడాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, జలజీవన్ మిషన్ తదితర ప్రాజెక్టులపైనా సోమవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికీ కొన్నిచోట్ల పనులు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు మొదలు పెట్టకపోతే రద్దయిపోతాయని హెచ్చరించారు. జగనన్న కాలనీల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు తదితర అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. నవంబరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలన్నారు. జలజీవన్ మిషన్ పనులను త్వరగా పూర్తిచేసి, ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, మెప్మా పీడీ సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.
వచ్చే నెల నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అనుసరించి వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నామని కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు వ్యవహ రించాలని, పట్టించుకోకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 65లో పేర్కొన్న అంశాలను వివరించారు.
Updated Date - 2022-10-18T04:13:24+05:30 IST