ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంచెత్తిన ముసురు

ABN, First Publish Date - 2022-10-08T05:05:40+05:30

అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సాలూరులో జాతీయరహదారిపై ప్రవహిస్తున్న వరదనీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం

 నదులు, చెరువులకు పోటెత్తుతున్న వరద

ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ముంపులో పంటలు.. ఆందోళనలో రైతులు

పాలకొండ/సాలూరు రూరల్‌/మక్కువ/గరుగుబిల్లి: అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం కూడా కురిసిన ఎడతెరిపిలేని వానకు జనజీవనం స్తంభించింది.  పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాలతో పాటు జియ్యమ్మవలస, కురుపాం, సాలూరు తదితర మండలాల్లో రోజంతా వర్షం పడింది. డివిజన్‌ కేంద్రమైన పాలకొండలో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఆయా ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు, వాహనదారులు ప్రయాణాలకు నానా అవస్థలు పడ్డారు.  సాలూరు మండలం ఏవోబీ కొండల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వేగావతి, సువర్ణముఖీ, గోముఖీతో పాటు చెరుకుపల్లిగెడ్డ, పోతులగెడ్డ, అమ్మవలస గెడ్డ తదితర వాగులు పొంగిపొర్లుతున్నాయి. అమ్మవలస గెడ్డ పోటెత్తడంతో రెండు గంటలపాటు పాచిపెంట-సాలూరు రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో కొన్ని గంటల పాటు  సాలూరు ఏజెన్సీలో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చెరుకుపల్లి గెడ్డకు వరద పొటెత్తడంతో సాలూరులో 26వ నెంబర్‌ జాతీయ రహదారిపై నీరు నిలిచింది. పట్టణంలోని  ఆర్టీసీ కాంప్లెక్స్‌, రామాకాలనీ, అఫిషీయల్‌ కాలనీ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో ఆయా ప్రాంతవాసులు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. జోరువాన వల్ల పంట నష్టపోతున్నామని మరోవైపు మొక్కజొన్న, పత్తి రైతులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఏదేమైనా మరో రెండు రోజుల పాటు వర్షాలు అధికంగా కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లావాసులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిండుగా నదులు 

ఒడిశాలోని క్యాచ్‌మెంట్‌ ఏరియాతో పాటు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని భామిని మండలం మీదుగా వంశధార ప్రవహిస్తుండగా, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండ మండలాల మీదుగా నాగావళి  ప్రవహిస్తోంది. వరద  ఉధృతి కారణంగా మడ్డువలస, తోటపల్లి బ్యారేజీనుంచి కిందకు నీరు విడిచిపెడుతుం డడంతో  నాగావళి నదిలో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. మొత్తంగా 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.  ఇదే సమయంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. మక్కువ మండలంలో వెంగళరాయ సాగర్‌ జలాశయం ద్వారా నీరు విడిచిపెట్టడంతో గోముఖి, సువర్ణముఖి నదులు పొంగి ప్రవహి స్తున్నాయి. కవిరిపల్లి వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో సుమారు 20 గ్రామాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్ట వద్ద  నాగవళి నదిలో శుక్రవారం సాయంత్రానికి నీటి నిల్వ 105 మీటర్లకు గాను 104 మీటర్ల లెవిల్‌లో ఉంది.  ప్రస్తుతం నది పైభాగం నుంచి ప్రాజెక్టుకు 3.678 క్యూసెక్కుల నీరు రాగా ఈ మేరకు అధికారులు రెండు గేట్లను ఎత్తి వేసి 4.103 క్యూసెక్కులను నదిలోకి విడిచి పెట్టారు.  ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలు కాగా  1.8 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.   

చెరువును తలపించేలా.. 

సీతంపేట: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సీతంపేట ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో భారీగా వర్షపునీరు చేరింది.  ఆ ప్రాంగణం చెరువును తలపించింది. రహదారిపై నుంచి దిగువకు పెద్ద ఎత్తున చేరే వర్షపునీరు పోయేందుకు సరైన కాలువలు లేకపోవడంతో కార్యాలయం గేటు వద్ద ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు, ప్రజలు అటువైపుగా రాకపోకలు సాగించలేక పోయారు. 

     

Updated Date - 2022-10-08T05:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising