ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరు వాన

ABN, First Publish Date - 2022-08-09T05:17:19+05:30

అల్పపీడన ద్రోణి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

పడవను సురక్షిత ప్రాంతానికి తరలించుకొంటున్న మత్స్యకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మరో 2 రోజులు కురిసే అవకాశం
ద్రోణి తీవ్ర అల్పపీడనంగా మారవచ్చునంటున్న వాతావరణ నిపుణులు
కంట్రోలు రూంలు ఏర్పాటు
విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ భోగాపురం, ఆగస్టు 8 :
అల్పపీడన ద్రోణి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచనలు ఇచ్చారు. పల్లపు ప్రాంతాల వారిని కూడా అప్రమత్తం చేశారు. తుఫాన్‌ ప్రభావంతో సోమవారం కూడా వర్షం పడింది. విజయనగరంతో పాటు బొబ్బిలి, గజపతినగరం, బొండపల్లి, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్‌.కోట తదితర ప్రాంతాల్లో  ఉదయం నుంచి చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. రాగల రెండు రోజులూ సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు ఇంటిపట్టునే ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి కూడా ఆదేశించారు. ఇదే సమయంలో విజయనగరంలోని కలెక్టర్‌ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయంతో పాటు కొన్ని తహసీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. వర్షాలకు జలాశయాల్లో భారీగా  నీరు చేరుతోంది. వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి.

ఉధృతంగా కెరటాలు
అల్పపీడన ప్రభావంతో భోగాపురం మండలం ముక్కాం సముద్ర తీరం సోమవారం అల్లకల్లోలంగా కనిపించింది.  కెరటాలు ఉధృతంగా తీరాన్ని తాకాయి. తీరంలో ఉంచిన పడవలు, వేట సామగ్రి కొట్టుకుపోకుండా మత్స్యకారులు  సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు.

కంట్రోల్‌ రూమ్‌ల ఫోన్‌ నంబర్లు
కార్యాలయం                      ఫోన్‌ నెంబరు
కలెక్టర్‌ కార్యాలయం                08922 236947
విజయనగరం ఆర్డీవో కార్యాలయం     08922-276888
చీపురుపల్లి ఆర్డీవో కార్యాలయం       94407 17534
బొబ్బిలి ఆర్డీవో కార్యాలయం          08944-247288
భోగాపురం                        80744 00947
పూసపాటిరేగ                      70367 63036
మత్స్యశాఖ కార్యాలయం            08922-273812
విద్యుత్‌శాఖ కార్యాలయం           94906 10102


Updated Date - 2022-08-09T05:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising