ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడిన ధాన్యం లారీ

ABN, First Publish Date - 2022-01-24T05:17:30+05:30

ధాన్యం బస్తాల లోడుతో వెళ్తున్న ఓ లారీ రేగుబిల్లి గ్రామ సమీ పంలోగల చెరువులో పడిపోయి న సంఘటన ఆదివారం చోటుచే సుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంట్యాడ, జనవరి 23:  ధాన్యం  బస్తాల లోడుతో వెళ్తున్న ఓ లారీ రేగుబిల్లి గ్రామ సమీ పంలోగల చెరువులో పడిపోయి న సంఘటన ఆదివారం చోటుచే సుకుంది. వివరాలిలా ఉన్నాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా లకు చెందిన మిల్లర్లు జిల్లాలోని రైతుల నుంచి ధాన్యం సేకరించి మరపెట్టాడానికి ఆయా జిల్లాల కు తరలిస్తున్నారు. దీనిలో భాగంగా మండలంలోని పెంటశ్రీ రాంపురం గ్రామానికి చెందిన నలుగురు రైతుల నుంచి సుమారు 600 బస్తాలు (40 కేజీలు చొప్పున) ధాన్యాన్ని తూర్పుగోదావరికి చెందిన మిల్లరు కొనుగోలు చేశారు. ఇక్కడ నుంచి లారీపై తరలిస్తుండగా రేగుబిల్లి వద్దకు వచ్చేసరికి, రహదారి చిన్నది కావడంతో లారీ ఒక్కసారిగా పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. మొత్తం ధాన్యం బస్తాల న్నీ చెరువులో పడిపోయాయి. అనంతరం లారీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు. విషయం తెలుసుకున్న సీఎస్‌డీటీ కొల్లి సన్యాసినాయుడు లారీ పడిపో యిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇంకా ఆయా మిల్లరు ట్రక్‌ షీటు జనరేట్‌ చేయలేదు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లినట్టు సీఎస్‌డీటీ చెప్పారు. 

 

Updated Date - 2022-01-24T05:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising