చెత్త సంపద కేంద్రంలో ధాన్యం
ABN, First Publish Date - 2022-12-15T00:07:36+05:30
గరుగుబిల్లిలోని చెత్త సంపద కేంద్రాన్ని ధాన్యం నిల్వ కేంద్రంగా మార్చేశారు.
- నీరుగారుతున్న లక్ష్యం
- చోద్యం చూస్తున్న ప్రభుత్వం
గరుగుబిల్లి: గరుగుబిల్లిలోని చెత్త సంపద కేంద్రాన్ని ధాన్యం నిల్వ కేంద్రంగా మార్చేశారు. పంచాయతీ పరిఽధిలో గల చెత్తను సేకరించి సంపద తయారీ సృష్టించాలన్న ప్రభుత్వం నిర్మించింది. అయితే అధికారుల పర్య వేక్షణ లేకపోవడంతో లక్ష్యం నీరు గారుతోంది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి అసం పూర్తిగా ఉన్న రేకులషెడ్‌ను పూర్తిచేశారు. ఇప్పటివరకు బిల్లుకాకపోవడంతో ఆయన అందులో ధాన్యం నిల్వ చేశారు. ఈ పనులకు పంచాయతీ నుంచి నిధులు చెల్లింపునకు అవకాశం ఉన్నా చెల్లించడంలేదని విమర్శలొస్తున్నా యి. ఈ నేపథ్యంలో సంపద కేంద్రంలో ధాన్యం నిల్వలు ఉండడంతో వ్యర్ధా లు బయట వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ పరిస్థితి..
ప్రధాన రహదారికి ఆనుకొని, తహసీల్దార్, మండల అభివృద్ధి కార్యాల యానికి ఎదురుగా చెత్త నుంచి సంపద తయారుచేసే కేంద్రాన్ని 2017-18 లో నిర్మించారు. ఈ కేంద్రానికి అప్పట్లో రూ. రెండు లక్షలకుపైగా నిధులు మంజూరయ్యాయి. ప్రత్యేకాధికారుల పాలన సమయంలో మంజూరైన నిధులతో పనులు కొంతమేర పూర్తిచేశారు. తర్వాత షెడ్ పైభాగంలో రేకులు ఏర్పాటుకు నిధుల సమస్య ఏర్పడింది. దీంతో రేకు షెడ్డు ఏర్పాటు చేస్తే ఆ మేరకు నిధులు అందజేస్తామని అధికారులు హామీ ఇవ్వడం తో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పనులు పూర్తి చేశారు.
బిల్లులు కాక...
కొన్నేళ్లుగా గ్రామంలో సేకరించిన వ్యర్థాలను గ్రీన్ అంబా సిడర్లు చెత్త సేకరణ కేంద్రానికి తరలించేవారు. కేంద్రానికి రూ.1.50 లక్షలతో రేకులు ఏర్పాటుచేసినా బిల్లుకాలేదు. దీంతో ఈ విషయాన్ని పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే నిబంధనల మేరకు ఉపాధి హామీ పథకంలో భాగంగా చెల్లింపులకు అవకాశం లేకుండా పోయిందని ఆ విభాగ సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు స్వచ్ఛభారత్ పరిధిలో చెల్లింపులు చేయాల్సి ఉంది. అయితే అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సదరు వ్యక్తి నూర్పు చేసిన ధాన్యం బస్తాలను చెత్త సంపద కేంద్రంలో నిల్వ చేశారు. తనకు రావలసిన మొత్తం చెల్లిస్తేనే ఖాళీ చేస్తామని అధికారులకు ఆయన వివరించాడు. కాగా బిల్లులు చెల్లించా లని కార్యదర్శికి సూచించామని మండల పంచాయతీ విస్తరణాధికారి ఎల్.గోపాలరావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. పరిశీలించి నిబంధనల మేరకు అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు.
Updated Date - 2022-12-15T00:07:37+05:30 IST