ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంచూరియన్‌ స్నాతకోత్సవానికి రేపు గవర్నర్‌ రాక

ABN, First Publish Date - 2022-12-15T23:41:43+05:30

సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో ఈనెల 17న నిర్వహించనున్న ద్వితీయ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ముఖ్యఅతిథి గా రానున్నట్లు వీసీ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లిమర్ల: సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో ఈనెల 17న నిర్వహించనున్న ద్వితీయ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ముఖ్యఅతిథి గా రానున్నట్లు వీసీ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు వెల్లడించారు. విశ్వవిద్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 17వ తేదీ సాయంత్రం ఈ వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈసంద ర్భంగా ఇంజినీరింగ్‌, పారా మెడికల్‌ సైన్సెస్‌కు సంబంధించి వివిధ బ్రాంచిలలో టాపర్లకు గవర్నర్‌ చేతులమీదుగా బంగారు పతకాలు అందజేస్తారని తెలిపారు. అలాగే ప్రొఫెసర్‌ శాంతమ్మ ప్రోత్సాహంతో ఒక పేద విద్యార్థికి పదివేల రూపా యలు అందజేయనున్నట్టు చెప్పారు. గౌరవ అతిథిగా కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఎం.సేవలనాయక్‌ పాల్గొంటారని అన్నారు. ఆ రోజు కార్యక్రమానికి చాన్స లర్‌ పద్మశ్రీ డా.దేవీప్రసన్న పట్ననాయిక్‌ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ పీఎస్‌వీ రమణారావు, డిప్యూటీ రిజిస్ర్టార్‌ డా.ఆర్‌ఎస్‌ వర్మ, డీన్‌ డా.కృష్ణమూర్తి, డీన్‌ ఎంఎల్‌ఎన్‌ ఆచార్యులు, డీన్‌ సన్నీడి యోల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:41:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising