ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంపులోకి మరొకటి!

ABN, First Publish Date - 2022-07-01T05:20:30+05:30

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కొన్నేళ్లుగా తిష్ఠ వేసిన గజరాజుల సంఖ్య పెరిగింది. గురువారం ఉదయం ఆ గుంపులో ఉన్న ఏనుగు కొమరాడ మండలం అర్తాం సమీపంలోని తోటల్లో పిల్ల ఏనుగుకు జన్మనిచ్చింది.

పిల్ల ఏనుగుతో గజరాజులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  సంఖ్యను పెంచుకున్న గజరాజులు

  ప్రసవించిన ఏనుగు

 పిల్ల ఏనుగుతో కలిపి ఏడుకు చేరిన వాటి సంఖ్య

కొమరాడ, జూన్‌ 30 : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కొన్నేళ్లుగా తిష్ఠ వేసిన గజరాజుల సంఖ్య పెరిగింది. గురువారం ఉదయం ఆ గుంపులో ఉన్న   ఏనుగు కొమరాడ మండలం అర్తాం సమీపంలోని తోటల్లో పిల్ల ఏనుగుకు జన్మనిచ్చింది. వాటి దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. వాస్తవంగా ఆరేళ్ల కిందట జిల్లాలోకి ప్రవేశించిన ఎనిమిది ఏనుగులు ఏజెన్సీలోనే సంచరిస్తున్నాయి. ఇందులో మూడు విద్యుత్‌ షాక్‌, ఆరోగ్య కారణాల వల్ల చనిపోయాయి. దీంతో వాటి సంఖ్య ఐదుకు చేరింది. 2020లో ఈ ప్రాంతంలో ఆ గుంపులోనే ఉన్న   ఏనుగు ఒక పిల్ల ఏనుగుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అదే ఏనుగుకు పుట్టిన పిల్ల ఏనుగుతో కలిపి వాటి సంఖ్య ఏడుకు చేరింది. కొంత కాలంగా గజరాజులు ఈ ప్రాంతంలో తిరుగుతూ పంటలు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. వాటివల్లఇప్పటివరకూ ఏడుగురు మృతి చెందారు. ఎనిమిది మూగజీవాలు కూడా మృత్యువాతపడ్డాయి. ఎంతోమంది గాయాలపాలయ్యారు. నిత్యం ఏదోఒకచోట ఏనుగులు సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసున్నాయి. అయినా వాటిని తరలించేందుకు ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవడంలేదు. 


Updated Date - 2022-07-01T05:20:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising