ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండైన ‘తామర’ చెరువు

ABN, First Publish Date - 2022-06-22T05:07:28+05:30

నడి వేసవిలో కూడా నిండైన పచ్చదనంతో కనిపిస్తున్న ఈ చెరువు సంతకవిటి మండలం సిరిపురంలోనిది. సుమారు 1,250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు అతి పెద్దదిగా ప్రాచుర్యం పొందింది. చెరువు గట్టుపై నిల్చుకుంటే కనుచూపు మేర కూడా కనిపించదు. ఏడాది పొడవునా నీరు ఉండడంతో పాటు తామర ఆకులతో నిండి ఉండడం ఈ చెరువు ప్రత్యేకత. పచ్చదనంతో పాటు చల్లని వాతా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడి వేసవిలో కూడా నిండైన పచ్చదనంతో కనిపిస్తున్న ఈ చెరువు సంతకవిటి మండలం సిరిపురంలోనిది. సుమారు 1,250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు అతి పెద్దదిగా ప్రాచుర్యం పొందింది. చెరువు గట్టుపై నిల్చుకుంటే కనుచూపు మేర కూడా కనిపించదు. ఏడాది పొడవునా నీరు ఉండడంతో పాటు తామర ఆకులతో నిండి ఉండడం ఈ చెరువు ప్రత్యేకత. పచ్చదనంతో పాటు చల్లని వాతావరణంతో ఈ ప్రాంతీయులకు ఇదో పర్యాటక ప్రాంతంగా నిలుస్తోంది. వేసవిలో సాయంత్రం 4 గంటలు దాటితే చాలూ పరిసర గ్రామాల ప్రజలు, అటువైపుగా ప్రయాణించేవారు కొద్దిసేపు చెరువు వద్ద ఆగి గడుపుతారు. గత టీడీపీ ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ రూపొందించిన తరుణంలో ఎన్నికలు ముంచుకొచ్చాయి. గత మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తామర చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. 

- విజయనగరం (ఆంధ్రజ్యోతి)


Updated Date - 2022-06-22T05:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising