ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి సమస్య లేకుండా చూడాలి

ABN, First Publish Date - 2022-11-30T00:10:46+05:30

గ్రామాల్లో ఇంటింటి కొళాయి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏక్కడ తాగునీరు రాలేదన్న మాట వినిపించకూడదని తాగునీటి శాఖ అధికారులకు జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెరకముడిదాం: గ్రామాల్లో ఇంటింటి కొళాయి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏక్కడ తాగునీరు రాలేదన్న మాట వినిపించకూడదని తాగునీటి శాఖ అధికారులకు జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించా రు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ తాడ్డి కృష్ణవేణి అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తాగునీటి శాఖ సమీక్షలో భాగంగా ఇంటిం టి కొళాయిల నిర్వహణకు ప్రత్యేక కమిటీలు వేసి, ప్రతి ఇంటి నుంచి కొంత మొత్తంలో వసూళ్లు చేసి, వాటి నిర్వహణకు వాడాలని, దీనికి సభ్యులు సలహాలు ఇవ్వాలని, ఇక్కడ చేసే తీర్మానం ఆదర్శప్రాయం కావాలన్నారు. అందరు సభ్యులు సలహాలు తర్వాత ఒక్కో ఇంటికి నెలకి రూ.30 వసూలు చేసేందుకు నిర్ణయించారు. అనంతరం గ్రామాల్లో ఇప్పటివరకు జరిగిన, త్వరలో చేపట్టనున్న ఇంటింటి కొళాయిల నిర్మాణ పనులపై సమీక్షలో భాగంగా డీఈ గోవిందరావు పనితీరుపై అసహనం వ్యక్తంచేశారు. పనితీరు మార్చుకోవాలని, సమావేశాల్లో సమాధానం సరిగ్గా ఉండాలని చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం వైద్య శాఖ సమీక్షలో భాగంగా సచివాలయంలో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంల పని తీరుపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. కనీసం పనిచేయడం లేదని తెలపగా, దీనికి సంబంధించి చైర్మన్‌ వెంటనే జిల్లా వైద్య శాఖాధికారితో ఫోన్‌లో మాట్లాడి, వీరితో ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. అంతకముందు వ్యవసాయ శాఖ సమీక్షలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించారు.

Updated Date - 2022-11-30T00:10:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising