ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చుక్కలు చూపిస్తున్నారు

ABN, First Publish Date - 2022-12-16T23:57:00+05:30

ధాన్యం కొనుగోలులో మిల్లర్లు చుక్కలు చూపిస్తున్నారని భామినికి చెందిన రైతులు వాపోయారు.

సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌కలెక్టర్‌ దృష్టికి సమస్య

భామిని: ధాన్యం కొనుగోలులో మిల్లర్లు చుక్కలు చూపిస్తున్నారని భామినికి చెందిన రైతులు వాపోయారు. దీనిపై అధికారులు స్పందించాలని వారు కోరారు. శుక్రవారం గురండిలో పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ రైతులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను వివరించారు. భామిని ఆర్‌బీకేకి ధాన్యం తీసుకెళ్లగా 16.5 శాతం తేమ శాతం ఉందని గుర్తించి పాలకొండ రైస్‌మిల్లుకుపంపించారని, అక్కడకు వెళితే తాము తీసుకోమని మొండికేశారని వెంకటరమణ అనే రైతు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేయగా మిల్లర్లు 19 శాతం తేమ ఉందని స్పష్టం చేశారని చెప్పారు. కాగా ధాన్యం దింపించేందుకు బస్తాకు రూ.12 చెల్లించాల్సి వస్తోందన్నారు. ధాన్యం దింపే చార్జీలతో పాటు అదనంగా రూ.2 వేలు మిల్లరుకు చెల్లించినట్లు వివరించారు. ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్తే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రభుత్వమే నాణ్యత పరిశీలించి మిల్లర్లకు పంపించాలని పలువురు రైతులు కోరారు. ప్రతి రైతు నుంచి ధాన్యం తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని సబ్‌ కలెక్టర్‌ చెప్పారు. రైతులకు రవాణా ఖర్చు అందజేస్తున్నామని, ధాన్యం దింపే బాధ్యత మిల్లర్‌దేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వంశధార పనులకు సహకరించిన గురండి, భామిని, నులకజోడు తదితర గ్రామాల రైతులకు రెండో విడత నష్టపరిహారం అందలేదని కొందరు సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై భూ సర్వే అధికారులతో మాట్లాడుతానని ఆయన తెలిపారు. ప్రతిఒక్కరూ భూముల రీ సర్వేకు సహకరించాలని కోరారు. రైతులకు ఎటువంటి సందేహాలున్నా తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లాలని, అక్కడ పరిష్కారం కాకపోతే తన దృష్టికి తేవాలని సూచించారు. సర్వే పూర్తయిన వెంటనే రైతుల భూముల్లోని హద్దులకు సంబంధించి సర్వేరాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంతో పాటు పాఠశాలను పరిశీలించారు. నిలిచిపోయిన నాడు-నేడు పనులపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఆయన వెంట తహసీల్దార్‌ అప్పారావు, సర్వేయర్‌ రామ్మోహన్‌రావు, రైతులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising