ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛను అందక..

ABN, First Publish Date - 2022-07-03T05:08:57+05:30

సంకిలి పంచాయతీలో పింఛనుకు నోచుకోక 96 మంది నిరాశ చెందుతున్నారు. సచివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ పంచాయతీలో వివిధ రకాల పింఛన్లన్నీ కలిపి 748 ఉండగా వీరందరికీ నెలకు రూ.18.26లక్షలు అవసరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంకిలిలో 96 మంది ఎదురుచూపులు
రేగిడి, జూలై 2:
సంకిలి పంచాయతీలో పింఛనుకు నోచుకోక 96 మంది నిరాశ చెందుతున్నారు. సచివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ పంచాయతీలో వివిధ రకాల పింఛన్లన్నీ కలిపి 748 ఉండగా వీరందరికీ నెలకు రూ.18.26లక్షలు అవసరం. ఈ గ్రామ బ్యాంక్‌ అకౌంట్‌కు ఈ నెల పింఛన్ల కోసం ఇప్పటివరకు రూ.15.1లక్షలు మాత్రమే జమైంది. దీంతో రెండురోజుల్లో 652మందికే పింఛన్లు పంపిణీ చేశారు. మిగితావారు సచివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. దీనిపై లబ్ధిదారులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో మరోరోజు వీరు నిరీక్షించక తప్పదు. రేగిడి మండలంలోని 25 సచివాలయాల పరిధిలో 10592 పింఛన్‌దారులు ఉన్నారు. వారందరికీ పంపిణీ కోసం రూ.2.69 కోట్లు అవసరం. రూ.2.59 కోట్లు జమకాగా ఇంకా రూ. 4.13లక్షలు రావాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పింఛను నిలిచిపోయిన వారిలో సంకిలి పంచాయతీలో ఎక్కువ మంది ఉన్నారు. దీనిపై ఎంపీడీవో  రఘనాథ్‌ ఆచారిని వివరణ కోరగా నగదు కొరత వాస్తవమేనని, ఇప్పటివరకు బ్యాంక్‌ ఖాతాకు జమైన మొత్తాన్ని పంపిణీ చేశామన్నారు. సంకిలికి ఇంకా నగదు జమకావాల్సి ఉందని వెల్లడించారు.

Updated Date - 2022-07-03T05:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising