రెన్యువల్ చేయండి
ABN, First Publish Date - 2022-10-18T04:39:53+05:30
ఐటీడీఏల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమను రెన్యువల్ చేయాలని సవర భాషా వలంటీర్లు డిమాండ్ చేశారు.
సవర భాష వలంటీర్ల నిరసన
ఐటీడీఏల ఎదుట 72 గంటల రీలే దీక్ష
పార్వతీపురం, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి)/సీతంపేట: ఐటీడీఏల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమను రెన్యువల్ చేయాలని సవర భాషా వలంటీర్లు డిమాండ్ చేశారు. సోమవారం పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ కార్యాలయాల ఎదుట 72 గంటల రీలే దీక్ష చేపట్టారు. పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్నప్పటికీ తమను రెన్యువల్ చేయకపోవడం దారుణమన్నారు. ఉపాధి లేక అవస్థలు పడుతున్నామన్నారు. గతంలో పనిచేసిన కాలానికి సంబంధించి నాలుగు నెలల వేతనం కూడా ఇంకా చెల్లించకపోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సవర భాష వలంటీర్ల దీక్షకు యూటీఎఫ్ నాయకుడు మురళీమోహన్‌రావు, గిరిజన సంఘం సీపీఎం, టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. సవర భాషా వలంటీర్ల జిల్లా అధ్యక్షుడు సవర డుంబు, సవర రాజు, సవర ఆనంద్, సవర ఎల్లంగో తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:39:53+05:30 IST