ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు

ABN, First Publish Date - 2022-11-16T00:10:43+05:30

గిరిజన విద్యార్థులకు ఈ నెల 16 నుంచి జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి బి.సూర్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థులకు ఈ నెల 16 నుంచి జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి బి.సూర్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జన జాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ఒక రోజు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 12న నాలుగు క్లస్టర్లలో పోటీలు నిర్వహించామన్నారు. ఇందులో ఎంపిక చేసిన సుమారు 400 మంది విజేతలు, ఉత్తమ క్రీడాకారులు జిల్లా పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌, ఆర్చరీ, అథ్లెటిక్స్‌, వ్యాస రచన, వక్తృత్వ, డ్రాయింగ్‌, డ్యాన్స్‌, తదితర విభాగాల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.

111111111111111

Updated Date - 2022-11-16T00:10:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising