ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గజగజ’లాడించాయ్‌

ABN, First Publish Date - 2022-12-07T00:10:13+05:30

భామిని మండలం బిల్లుమడ గ్రామ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

బిల్లుమడ కొండపై సంచరిస్తున్న ఏనుగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భయాందోళనలో గ్రామస్థులు , రైతులు

భామిని/సీతంపేట: భామిని మండలం బిల్లుమడ గ్రామ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంటలు, వ్యవసాయ పరికరాలను నాశనం చేశాయి. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన చెందారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. వాస్తవంగా గతంలో ఘనసర, తాలాడ ప్రాంతాల్లో హల్‌చల్‌ చేసిన ఏనుగులు తాజాగా ఒడిశా నుంచి వంశధార నది దాటి బిల్లుమడ గ్రామ సమీపంలోకి వచ్చాయి. రైతులు అమూల్య పాడి, దామోదరం తదితరులకు చెందిన నీటి ఇంజన్లు, అరటితోటలు, మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఏనుగుల సంచారం విషయాన్ని తెలుసుకున్న ఆ గ్రామంతో పాటు నేరడి వాసులు డప్పులు మోగిస్తూ గజరాజులను ఒడిశా వైపు మళ్లించారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖాధికారులు, సచివాలయ సిబ్బంది జయరాజు, వీఏఏ మహేంద్ర, నాగమ్మ, సర్పంచ్‌ రాధాకృష్ణ తదితరులు మంగళవారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. రైతులను పరామర్శించి నష్టపరిహారాలు నమోదు చేసుకున్నారు. సీతంపేట మండలం చిన్నబగ్గ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉన్న బిల్లుమడ కొండపై రెండు ఏనుగులు తిరుగుతున్నట్టు కొత్తూరు ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారులు హరికృష్ణ మంగళవారం తెలిపారు. ఇటీవల అవి హిరమండలంలో సంచరించాయని, సోమవారం అర్థరాత్రి ఈ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోకి వచ్చాయని చెప్పారు. ఏనుగుల కదిలికలను ఎప్పటికప్పుడు కేర్‌ ట్రాకర్స్‌ పరిశీలిస్తున్నారని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సెక్షన్‌ అధికారి హరికృష్ణ స్పష్టం చేశారు. కాగా ఈ ప్రాంతంలో వరి కోత పనుల్లో ఉన్న రైతులు గజరాజుల విషయం తెలిసి ఆందోళన చెందుతున్నారు. తక్షణమే వాటిని తరలించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2022-12-07T00:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising