కోనేరు ఆక్రమణపై ఫిర్యాదు
ABN, First Publish Date - 2022-12-15T23:40:22+05:30
కందివలసలో గంగమ్మ కోనేరు ఆక్రమణపై ఆ గ్రామానికి చెందిన కొందరు తహసీల్దార్ భాస్కరరావుకు గురువా రం ఫిర్యాదు చేశారు.
పూసపాటిరేగ: కందివలసలో గంగమ్మ కోనేరు ఆక్రమణపై ఆ గ్రామానికి చెందిన కొందరు తహసీల్దార్ భాస్కరరావుకు గురువా రం ఫిర్యాదు చేశారు. గ్రామంలో గంగమ్మ కోనేరు కింద సుమారు 10ఎకరాల ఆయకుట్ట ఉంది. ఈ కోనేరు గట్టు ద్వారా మంగన్న బందతో పాటు అటువైపుగా ఉన్న గృహాలకు ఒకే మార్గం. అయితే స్థానికంగా ఉన్న దేశెట్టి వెంకటప్పారావు చెరువు గర్భంలో ప్రహరీ నిర్మించి, ఆక్రమణకు పాల్పడుతున్నాడని స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో ఇదే విధంగా ఆక్రమిస్తే రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే నిర్వహించి, నిర్మాణం చేపట్టవద్దని హెచ్చరించినా ప్రహరీ నిర్మిస్తున్నారని తెలిపారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Updated Date - 2022-12-15T23:40:28+05:30 IST