ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేర్లు మార్పుతోనే అభివృద్ధా?

ABN, First Publish Date - 2022-10-18T04:10:49+05:30

మూడున్నరేళ్ల కాలంలో పేర్లు మార్చడంలోనే ఈ ప్రభుత్వం అభివృద్ధి సాధించిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు.

విలేకరులతో మాట్లాడుతున్న నాగార్జున
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బొత్స అంతరంగం ఏమిటో
పదవికి తగ్గట్టుగా కోలగట్ల ప్రవర్తన లేదు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున
విజయనగరం రూరల్‌, అక్టోబరు 17:
మూడున్నరేళ్ల కాలంలో పేర్లు మార్చడంలోనే ఈ ప్రభుత్వం అభివృద్ధి సాధించిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడంపై రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలోనే విజయనగరంలో మహారాజా ఆసుపత్రి పేరులో మహారాజాని తీసేశారన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి కలిసొచ్చేదేమిటని ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలకు అర్థాలు వేరుగా వుంటాయన్నారు. ఆయన మాటలు కాని, అంతరంగం కాని ప్రజలకు అర్థం కావని విమర్శించారు. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల నల్లచొ క్కాలు ధరించి నిరసన తెలపడంపై ప్రజాస్వామ్యవాదులంతా చర్చించుకుంటు న్నారన్నారు. హోదాకు తగ్గట్టు ఆయన వ్యవహరించడం లేదన్నారు. టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, బొద్దల నర్సింగరావులు మాట్లాడుతూ, సిరిమానోత్సవం నిర్వహణలో ఈ ఏడాది అనేక లోపాలు కన్పించాయన్నారు. చీకటి పడ్డాక సిరిమాను కన్పించలేదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, కంది మురళీనాయుడు, కోండ్రు శ్రీనివాసరావు, మైలిపిల్లి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-18T04:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising