ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు సభను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-12-15T23:59:25+05:30

రాజాంలో ఈనెల 22న టీడీపీ జాతీ య అధ్యక్షుడు చంద్రబా బు నాయుడు ఆధ్వర్యం లో నిర్వహించనున్న సభను విజయ వంతంచే యాలని పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీ మోహన్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంగర: రాజాంలో ఈనెల 22న టీడీపీ జాతీ య అధ్యక్షుడు చంద్రబా బు నాయుడు ఆధ్వర్యం లో నిర్వహించనున్న సభను విజయ వంతంచే యాలని పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీ మోహన్‌ కోరారు. గురువారం వంగరలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. పాదయాత్ర సమయంలో గుర్తించిన వనరులు దోచుకునే పనిలో పడ్డారని తెలిపారు. వంగర మొదలుకొని అమరావతి వరకు ఇసుక, రాయితోపాటు అనేక వనరులు దోచుకునే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రతీకార్యకర్త సైనికులా పనిచేసి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషిచేయాలన్నారు. ఇటీవల నియమితులైన పోర్టుపోలియో సభ్యులు మోహనరావు, ధనలక్ష్మితో పాటు పలువుర్ని సన్మానించారు. అనంతరం ఇదేం ఖర్మ పోస్టర్లు ఆవిష్కరించారు. టీడీపీ నాయకులు బొత్స వాసుదేవరావు నాయుడు, కృష్టముర్తి, రవి పాల్గొన్నారు. ఫ రేగిడి: రాజాం నియోజకవర్గంలో ఈనెల 22న చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమొహనరావు కోరారు. గురువారం మండలంలో ఉంగరాడమెట్ట దరి వండానిపేట పరిధిలోగల అమరావతి తోటలో పార్టీ మండలాఽ ద్యక్షుడు కిమిడి అశోక్‌కుమార్‌ అధ్యక్షతన కార్యకర్తలుసమావేశం నిర్వ హించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ రాజాం సభతో టీడీపీకి మంచి ఊపు తీ సుకురావాలని, ఇందుకు కార్యకర్తలు, నేతలు సమష్టిగా పనిచేయాలని కోరారు. కార్య క్రమంలో నా యకులు దూబ ధర్మరావు, గేదల బాలమురళి, కర్ణేణ మహేశ్వరరావు, వి.నాగభూష ణరావు, మజ్జి శ్రీనివాసరావు, గురవాన నారాయణరావు, శాసపు గోవిందరావు, గిరడ సింహాచలం పాల్గొన్నారు.

సంతకవిటి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాజాం పర్యటనను విజయవంతంచేయాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కోళ్ల అప్పల నాయుడు ఒక ప్రకటనలో గురువారం కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు గట్టి భాను ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ జన సమీకరణ కు చర్యలు చేపట్టేలా ఇప్పటికే సూ చించామని తెలిపారు. రాజాం, వంగర, రేగిడి మండలాల్లో కూడా కిమిడి అశోక్‌, మో హన్‌రావు, గురవాన నారా యణరావు, దు ప్పలపూడి శ్రీనివాసరావు, వంగా వెంకట రావు ఆధ్వర్యంలో జన సమీకరణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-15T23:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising