చలమ నీరే గతి!
ABN, First Publish Date - 2022-12-06T00:28:04+05:30
వీరంతా సాలూరు మండలం దేవుబుచ్చింపేట మహిళలు. ఇలా గుబేలు గెడ్డలో చెలమలు తవ్వుకొని తాగునీటిని సేకరిస్తున్నారు.
వీరంతా సాలూరు మండలం దేవుబుచ్చింపేట మహిళలు. ఇలా గుబేలు గెడ్డలో చెలమలు తవ్వుకొని తాగునీటిని సేకరిస్తున్నారు. సుమారు 15 కుటుంబాలు నివాసముంటున్న ఈ గ్రామంలో మినీ రక్షిత నీటి పథకం ఉంది. రెండు నెలల కిందట మోటారు పాడైంది. కొళాయి నీరు సరఫరా కావడం లేదు. దీంతో అప్పటి నుంచి చెలమల నీటిపై ఆధారపడుతున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈ గెడ్డ వద్దకు వెళ్లి నీరు సేకరిస్తున్నామని పారాది మేరమ్మ, పోలమ్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధులు ప్రబలుతాయని .. అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ గౌస్, బోరబంద పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా మోటారును బాగుచేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.
-సాలూరు రూరల్
Updated Date - 2022-12-06T00:28:06+05:30 IST