ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-04-12T16:15:54+05:30

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రి వర్గ కూర్పును పూర్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రి వర్గ కూర్పును పూర్తి చేశారు. తొలి మూడేళ్లపాటు మున్సిపల్ శాఖ విధులు నిర్వహించిన బొత్సకు ఈసారి విద్యాశాఖ అప్పగించారు. అంటే ఇక నుంచి ఏపీలో విద్య వెలుగొందాలంటే.. అది సీనియర్ రాజకీయ నేత అయిన బొత్స నోటి వెంట వినాల్సిందే అంటూ నెటిజన్లు హడావుడి చేస్తున్నారు. గతంలో బొత్స సత్యనారాయణ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూని పోస్టు చేస్తూ ‘మన కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.


ఒక్కోసారి మంత్రి బొత్స మాట్లాడే మాటలు అర్థంకాక జనాలు జుట్టుపీక్కుంటారు. మంత్రి మాటలు అర్థం కావాలంటే చెవులు నిక్కరించి వినాల్సిందే. ఇప్పుడు నెటిజన్లు పోస్టు చేసిన వీడియోలో మంత్రి మాటలు అర్ధం కాకుండా గందరగోళంగా ఉంది. గతంలో ఎప్పుడో మంత్రి బొత్స పలికిన పలుకులు నేడు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఉపన్యాసాలు వినడానికి ఏపీ విద్యార్ధులంతా సిద్ధంగా ఉండాలంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Updated Date - 2022-04-12T16:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising