ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు నమోదులో బీఎల్‌వోలు కీలకం

ABN, First Publish Date - 2022-12-07T00:04:39+05:30

ఓటు నమోదులో బూత్‌ లెవెల్‌ అధికారుల పాత్ర కీలకమని ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ ఎ.అహ్మద్‌బాబు తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల అబ్జర్వర్‌ అహ్మద్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఓటు నమోదులో బూత్‌ లెవెల్‌ అధికారుల పాత్ర కీలకమని ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ ఎ.అహ్మద్‌బాబు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రిటర్నింగ్‌ , సహాయ రిటర్నింగ్‌ అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కర్నీ ఓటరుగా నమోదు చేయాల్సిన బాధ్యత బూత్‌ లెవల్‌ అధికారులదేనని అన్నారు. ప్రతి బూత్‌ లెవెల్‌ అధికారికి నిర్దిష్ట ప్రదేశం కేటాయించి వారి పేరు, హోదా, విధులు తెలిపే విధంగా అక్కడ బోర్డు పెట్టాలని ఆదేశించారు. అదే విధంగా వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. జిల్లాలో చదువుకుంటున్న విద్యార్థుల వివరాలు సేకరించి సెలవుల్లో వారిని ఓటర్లుగా నమోదు చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీలు బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల ద్వారా అవగాహన కల్పించి అధికారులకు సహకరించాలని కోరారు. ఓటు నమోదులో ఎవరికైనా సమస్యలుంటే నేరుగా ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ నెంబరు 94414 12121కు ఫోన్‌ చేయాలని సూచించారు. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో 3,76,072 మంది పురుషులు, 3,91,912 మంది మహిళలు, 60 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారని చెప్పారు. మొత్తంగా 708 ప్రదేశాల్లో 1,024 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. జిల్లాలో ఇప్పటికి వెయ్యి మంది విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకున్నారని, 3 వేల మందికి ఫారం-6 అందిందని వివరించారు. మిగిలిన 17 వేల మందిని ఓటర్‌గా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొన్ని పంచాయతీల్లో ప్రజలు పక్క పంచాయతీల్లో ఓటర్లుగా నమోదై ఉన్నారని, వారు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు ఇబ్బంది పడుతున్నారని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవోలు సి.విష్ణుచరణ్‌, డాక్టర్‌ బి.నవ్య, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, డీఆర్వో జె.వెంకటరావు, ఆర్డీవో కె.హేమలత, తహసీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising