సర్పంచ్‌ల భిక్షాటన
ABN, First Publish Date - 2022-10-18T04:37:22+05:30
గ్రామ పంచాయతీలకు కేంద్ర సర్కారు మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వినియోగించుకోవడం దారుణమని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తెలిపారు.
టీడీపీ ఆధ్వర్యంలో నిరసన
పల్లెలకు నిధులు కేటాయించాలని డిమాండ్
సీతానగరం, అక్టోబరు 17: గ్రామ పంచాయతీలకు కేంద్ర సర్కారు మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వినియోగించుకోవడం దారుణమని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తెలిపారు. పల్లెలకు నిధులు కేటాయించకుండా సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాల్లా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. సర్కారు తీరుకు నిరసనగా సోమవారం సీతానగరంలో టీడీపీ సర్పంచ్‌లతో కలిసి భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి బజారు వరకూ ర్యాలీ కొనసాగించారు. వివిధ షాపుల వద్దకు వెళ్లి.. గ్రామాల అభివృద్ధికి తోచిన సాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్పంచ్‌లు పెంట సత్యంనాయుడు, వాకాడ అప్పమ్మ, మూడడ్ల లలిత వెంకటినాయుడు, నాయకులు తిరుపతిరావు, వేణుగోపాల్‌నాయుడు, పారినాయుడు, చంటి, లక్ష్మణరావు, సూర్యనారాయణ, నాగభూషణ్, శ్రీనివాసరావు, హరిగోపాల్, శంకరరావు, యోగీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:37:22+05:30 IST