ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులి కదలికలపై అప్రమత్తంగా ఉండండి

ABN, First Publish Date - 2022-08-18T05:28:36+05:30

పులి కదలికలపై అప్రమత్తంగా ఉండండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఫారెస్టు రేంజ్‌ అధికారి అప్పలరాజు

బొండపల్లి: పులి కదలికలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్‌ రేంజ ర్‌ ఎస్‌.అప్పలరాజు సూచించారు. వెదురువాడ పంచాయతీ పరిధిలోని కొత్తపనస లపాడు, మూలపాడు, పాత పనసలపాడు తదితర గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. కొత్త పనసలపాడు నుంచి కొత్త మూలపాడు వైపు పులి వెళ్లినట్టు పాదముద్రలు ద్వారా తెలుస్తుందని తెలిపారు. రాత్రిపూట అత్యవస రమైతేనే తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని సూచించారు. పశువులను సురక్షితమైన ప్రాంతాల్లో ఉంచుకోవాలన్నారు. అలాగే పులలను కాపాడాల్సిన బాధ్యత మనందిరిపైనా ఉందని, వాటికి ఎవరూ  హానితలపెట్టవద్దని కోరారు. పాదముద్రల ఆధారంగా నాలుగు మండలాల పరిధిలో తిరుగుతున్నది ఒకో పులిగా నిర్ధారణ అవుతుందన్నారు. పులి జాడ తెలుసుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈయన వెంట ఆండ్ర సెక్షన్‌ ఆఫీసర్‌ కేవీఎస్‌ రాజు, ఫారెస్టు బీట్‌ అధికారి కె.రామారావు, కొత్తపాలెం ఫారెస్ట్‌ బీట్‌ అధికారి కేవీ వెంకటరమణ, ఎంపీడీవో ఎ.వేదావతి, పంచాయతీ కార్యదర్శితోపాటు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఉన్నారు.  

Updated Date - 2022-08-18T05:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising