ఆటో బోల్తాపడి వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2022-03-05T05:37:31+05:30
ఆటో బోల్తాపడి కూలీ మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.
బెలగాం/రూరల్: ఆటో బోల్తాపడి కూలీ మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుట్టూరు గ్రామానికి చెందిన సంకరాపు రాము గత కొన్నేళ్లుగా భవన నిర్మాణ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే శుక్రవారం ఉదయం తోటి కూలీలతో ఆటోలో బయలుదేరి సీతానగరం మండలానికి పని కోసం వెళ్తుండగా మండలంలోని లచ్చిరాజుపేట, బందలుప్పి గ్రామాల మధ్యలో భారీ మలుపు వద్ద ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో రాముపై ఆటో పూర్తిగా పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కూలీలు క్షతగాత్రుడిని పార్వతీపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కు మరణించాడని రాము భార్య గౌరీ బోరున విలపిస్తోంది. రాముకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎస్‌ఐ సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-03-05T05:37:31+05:30 IST