సచివాలయాల్లో నెలకు కనీసం 250 సేవలు అందించాలి
ABN, First Publish Date - 2022-12-07T00:13:39+05:30
ప్రతి గ్రామ సచివాలయం ద్వారా నెలకు కనీసం 250 సేవలు అందించాలని కలెక్టర్ సూర్యకుమారి చెప్పారు. గంట్యాడ మండల రెవెన్యూ కార్యాలయానికి మంగళ వారం వచ్చిన ఆమె గృహ నిర్మాణాలు, ధాన్యం కొనుగోళ్లుపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21న సామూహిక గృహ ప్రవేశాలు జరగాలని, అందుకు లబ్ధిదారులను సన్నద్ధం చేయాలని అన్నారు.
కలెక్టర్ సూర్యకుమారి
గంట్యాడ, డిసెంబరు 6: ప్రతి గ్రామ సచివాలయం ద్వారా నెలకు కనీసం 250 సేవలు అందించాలని కలెక్టర్ సూర్యకుమారి చెప్పారు. గంట్యాడ మండల రెవెన్యూ కార్యాలయానికి మంగళ వారం వచ్చిన ఆమె గృహ నిర్మాణాలు, ధాన్యం కొనుగోళ్లుపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21న సామూహిక గృహ ప్రవేశాలు జరగాలని, అందుకు లబ్ధిదారులను సన్నద్ధం చేయాలని అన్నారు. అర్హతున్నవారికి ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. రైతులందరికీ మద్దతు ధర అందేలా ధాన్యం సేకరణ జరగాలని ఆదేశించారు. అనంతరం కొర్లాం సచివాలయాన్ని తనిఖీ చేశారు. మరో రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకూ వరి నూర్పుళ్లు చేపట్టకుండా చూడాలన్నారు. వరి కోతలు మొదలైన చోట వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలన్నారు. ఒకేసారి గ్రామమంతా కోతలు జరగకుండా దశల వారీగా నిర్వహిస్తే కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు ఉండవని సూచించారు.
- తొలుత గంట్యాడ జడ్పీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఎఫ్ఏ-1లో ప్రతిభ చూపిన వారిని రెవెన్యూ కార్యాలయానికి కలెక్టర్ రప్పించి అభినందించారు. వారితో కాసేపు మాట్లాడారు. చిట్టి గురువులు కార్యక్రమంపై చర్చించారు. ఎంతమందికి అక్షరాలు నేర్పారు?ఎంతమందితో పరీక్ష రాయించారు? అని ప్రశ్నించారు.
Updated Date - 2022-12-07T00:13:41+05:30 IST