ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో తుఫాన్‌?

ABN, First Publish Date - 2022-12-15T00:21:15+05:30

మరో తుఫాన్‌ రావొచ్చునని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు టెన్షన్‌ పడుతున్నారు. త్వరగా పంటను కల్లాలకు తరలించాలనుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం

కలెక్టరేట్‌, డిసెంబరు 14:

మరో తుఫాన్‌ రావొచ్చునని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు టెన్షన్‌ పడుతున్నారు. త్వరగా పంటను కల్లాలకు తరలించాలనుకుంటున్నారు. రెండు రోజులు క్రితం మాండస్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా కాస్త వర్షం కురిసింది. చిరుజల్లలే కురవడంతో వరిపై పెద్దగా ప్రభావం చూపలేదు. మళ్లీ నాలుగు రోజుల్లో తుఫాన్‌ ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు రావడంతో రైతులు వరి పంటను కల్లాలకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో పడ్డారు. జిల్లాలో 2 లక్షలు 30 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇప్పటి వరకూ లక్షా 55 వేల ఎకరాల్లో కోతలు పూర్తి చేసుకుని చిన్న చిన్న కుప్పలుగా పంటను భద్రపర్చారు. 75 వేల ఎకరాల్లో ఇంకా వరి కోతలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు సాగు చేస్తున్న వరి గింజలు కాస్త తడిచినా మొలకలు రావడంతో రైతులు కాస్త టెన్షన్‌ పడుతున్నారు. చేతికి అందే పంటను ఎలా దక్కించుకోవాలోనని కలవర పడుతున్నారు.

ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు

మరో నాలుగు రోజుల్లో తుఫాన్‌ ఉందని వాతావరణం శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయి. అయితే ఈ తుఫాన్‌ ప్రభావం జిల్లాపై పెద్దగా ఉండదన్న సూచనలు వచ్చాయి. రెండు రోజులైతే గాని స్పష్టంగా చెప్పలేం.

తారక రామరావు, జాయింట్‌ డైరెక్టర్‌, వ్యవసాయ శాఖ

---------

Updated Date - 2022-12-15T00:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising