పెయ్యి దూడల ఉత్పత్తి పథకాన్ని వినియోగించుకోండి
ABN, First Publish Date - 2022-12-15T23:42:37+05:30
పెయ్యి దూడల ఉత్పత్తి పథకాన్ని పాడి రైతులు వినియో గించుకోవాలని పశు సంవర్థక శాఖ ఏడీ, పశు గర్భకోశ వ్యాధి నిపుణుడు మహాపా త్రో ఉమాశంకర్ అన్నారు.
భోగాపురం: పెయ్యి దూడల ఉత్పత్తి పథకాన్ని పాడి రైతులు వినియో గించుకోవాలని పశు సంవర్థక శాఖ ఏడీ, పశు గర్భకోశ వ్యాధి నిపుణుడు మహాపా త్రో ఉమాశంకర్ అన్నారు. స్థానిక పశు వైద్యశాలలో ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడారు. లింగ నిర్ధారిత వీర్యం ఉపయోగించడం ద్వారా మేలైన పెయ్యి దూడ లను 90 శాతం కచ్చితత్వంతో పుట్టించగలమని చెప్పారు. ముర్రా, జెర్సీ, హెచ్‌ఎఫ్, జెర్సీక్రాస్, హెచ్‌ఎఫ్ క్రాస్‌గిర్, సాహివాల్ తదితర లింగ నిర్ధారిత వీర్య నాళికలు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆవుకు రెండు డోసులకు సంబంధించి రైతు రుసుం చెల్లించాలన్నారు. ఒక్కో డోసు విలువ రాయితీ పోను రూ.250 అని, రెండో డోసుకు రూ.500 చెల్లించాల్సి ఉందన్నారు. మొదటి డోసుకు గర్భం దాల్చకపోతే రెండో డోసు వేస్తారని చెప్పారు. మొదటి డోడుకే గర్భం దాల్చితే రైతుకు రూ.250 తిరిగి చెల్లిస్తామన్నారు.
Updated Date - 2022-12-15T23:42:39+05:30 IST