ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనులు పూర్తి చేయకుంటే చర్యలు

ABN, First Publish Date - 2022-08-20T05:28:43+05:30

నిర్ణీయత సమయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆదేశించారు.

మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, ఆగస్టు 19 :  నిర్ణీయత సమయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర  ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో  వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారుల తో సమీక్షించారు. తొలుత మక్కువ రహదారి పనులపై ప్రశ్నించారు. పాచిపెంట మండలంలో ఈతమానువలస వద్ద వంతెన నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ఆయన మండిపడ్డారు. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని తెలిపారు.  పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ  ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించి, నివేదిక అందించాలని సూచించారు. ఈ సమావేశంలో  జేసీ ఒ.ఆనంద్‌, సీతంపేట ఐటీడీఏ పీవో బి.నవ్య, డీఆర్‌వో జె.వెంకటరావు,  డ్వామా పీడీ రామచంద్రరావు,  పీఆర్‌, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, ఇరిగేషన్‌, ఇంజినీరింగ్‌ అధికారులు, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, పాముల పుష్పశ్రీవాణి, వి.కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్‌ పాల్గొన్నారు.

  

Updated Date - 2022-08-20T05:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising