ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీ కేసులో నిందితుల అరెస్టు

ABN, First Publish Date - 2022-08-13T05:48:34+05:30

చోరీ కేసులో నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

 విజయనగరం క్రైం: విజయనగరం పట్టణ పరిధి దండుమారమ్మ ఆలయంలో జరిగిన చోరీ కేసును నెల రోజుల తర్వాత దొంగలు పట్టుబడ్డారు. శుక్రవారం వన్‌టౌన్‌ సీసీఎస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్సీ,ఎస్టీ సెల్‌ డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కంటోన్మెంట్‌ సమీ పంలోని దండుమారమ్మ ఆలయంలో నెల రోజుల కిందట దొంగతం జరిగింది. అప్పటి నుంచి దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 12న కామాక్షినగర్‌ జంక్షన్‌లో వాహన తనిఖీలు చేస్తుండగా, అనుమానితులు పోలీసులను చూసి ద్విచక్ర వాహనంపై పారిపోయేందుకు ప్ర యత్నించగా పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌ వెండి అభరణాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన శికా ఆనంద్‌, విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి చెందిన పొన్నాడ కిరణ్‌, తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామానికి చెందిన ఎన్‌.సతీష్‌గా గుర్తించారు. శికా ఆనంద్‌, పొన్నాడ కిరణ్‌ ఆలయంలో దొంగిలించిన అభరణాలు ఎన్‌.సతీష్‌ వద్ద ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీరంతా పాత నేరస్థులే. వీరు వన్‌టౌన్‌ పరిధి, గజపతినగరం పీఎస్‌, కొత్తవలస పీఎస్‌, పెదమానాపురం, భీమునిపట్నం పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. విజయనగరానికి చెందిన వెంకట భాస్కరరావు ద్వారా వీరంతా ఒకరికి ఒకరు పరిచయం అయినట్టు విచారణలో గుర్తించారు. ఈ కేసుల్లో ఆయన పాత్ర ఉన్నది లేనిది విచారణలో తేలనుంది. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వీరి నుంచి స్కూటీతో పాటు, 27గ్రాముల బంగారు, 18.5 కిలోల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన సీఐలు కాంతారావు, వెంకటరావు, తిరుపతిరావు, ఎస్‌ఐలు అశోక్‌, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Updated Date - 2022-08-13T05:48:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising