ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొర్రెల మందపై పులి దాడి

ABN, First Publish Date - 2022-08-10T05:25:45+05:30

గొర్రెల మందపై పులి దాడి

పులి పాదముద్రలు సేకరిస్తున్న అటవీ అధికారులు, పులిదాడిలో గాయపడిన గొర్రె
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రెండు మృతి... మరో రెండింటికి గాయాలు 

- మేకను ఎత్తుకుపోయిందంటున్న కాపరులు

- పాదముద్రలు సేకరించిన అటవీ అధికారులు

మెంటాడ, ఆగస్టు 9: మండల వాసులను పులి భయం వెంటాడుతోంది. సోమవారం రాత్రి బిరసాడ వలస వద్ద జయతి గ్రామానికి చెందిన గొర్రెల మందపై పంజా విసిరింది. ఈ దాడిలో రెండు గొర్రెలు మృతి చెందగా, మరో రెండు గాయపడ్డాయి. ఒక మేకను పులి ఎత్తుకు పోయినట్టు ఈ దాడిని చూసిన గొర్రెల కాపరి చెప్పినట్టు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ కేవీఎన్‌ రాజు తెలిపారు. మేకలు తడినేలను చిత్తడి చేయడంతో పులి పాదముద్రల పోలికలు దొరక డం లేదని, అది వెళ్లిన మార్గాన్ని అన్వేషిస్తుండగా జయతి కొండ వద్ద కనుగొన్నట్టు తెలిపారు. పులి ఒడిశా కొండలు నుంచి అప్పట్లో వచ్చిందని, ఇప్పుడు ఆ మార్గం గుండా వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. 


ఇది మూడోసారి..

మండలంలో పులి సంచరించడం ఇది మూడోసారి. ఏప్రిల్‌లో తొలిసారి గుర్తించారు. పులి అడుగులు, వెంట్రుకలు అటవీశాఖ అధికారులు సేకరిం చి నిర్ధారించారు. అనంతసాగరం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని భావించి నిఘా కెమేరాలు ఏర్పాటు చేసినా ఆచూకీ లభ్యం కాలేదు. మూడు నెలలు తర్వాత గత నెలలో జీటీ పేట పంచాయతీ పనుకువాని వలస వద్ద పులి సంచరిస్తుందని గిరిజనులు కర్రలు పట్టుకొని కాపలా కాశారు. ఆ మరుచటి రోజున గజపతినగరం మండలం బంగారమ్మ పేట వద్ద పులిని చూసినట్టు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తరువాత కొత్తవలస, దత్తిరాజేరు మండలాల్లో పులి సంచరించినట్టు అధికారులు దృష్టికి వచ్చింది. ఇప్పుడు బిరసాడవలస వద్ద ప్రత్యక్షమైంది. ఇదిలా ఉండగా కొత్తవలస, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో సంచరిస్తున్న పులి ఇక్కడ సంచరిస్తున్న పులి ఒక్కటేనా? లేకుంటే మరొకటా అన్నది ఫారెస్టు అధికారులు కూడా తేల్చుకోలేకపోతున్నారు. 

Updated Date - 2022-08-10T05:25:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising