ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాకు అరుదైన గౌరవం

ABN, First Publish Date - 2022-01-22T04:57:41+05:30

జాతీయస్థాయిలో నెల్లిమర్ల ఏపీ బాలయోగి గురుకులం విద్యార్థినులు ఉత్తమ ప్రతిభకనబరిచారు. ప్రపంచ స్పేస్‌ వారోత్సవాల్లో భాగంగా అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌, ఇస్రో, సీబీఎస్‌ఈలు సంయుక్తంగా ‘స్పేస్‌ టెక్నాలజీ’పై ప్రాజెక్టులను ఆహ్వానించాయి. దేశ వ్యాప్తంగా 32 రాష్ట్రాల నుంచి 6,500 మంది విద్యార్థులు 2,500 ప్రాజెక్టులను రూపొందించి పంపించారు. అందులో 75 అత్యుత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. అందులో బాలయోగి

జాతీయస్థాయిలో ఎంపికైన ప్రాజెక్ట్‌తో బాలయోగి గురుకులం విద్యార్థినులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ స్థాయిలో నెల్లిమర్ల బాలయోగి గురుకులం విద్యార్థినుల ఖ్యాతి

3డీ ప్రజ్ఞాన్‌ రోవర్‌ ప్రాజెక్ట్‌కు 15వ స్థానం

రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

 అభినందనల వెల్లువ

నెల్లిమర్ల, జనవరి 21: జాతీయస్థాయిలో నెల్లిమర్ల  ఏపీ బాలయోగి గురుకులం విద్యార్థినులు ఉత్తమ ప్రతిభకనబరిచారు. ప్రపంచ స్పేస్‌ వారోత్సవాల్లో భాగంగా అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌, ఇస్రో, సీబీఎస్‌ఈలు సంయుక్తంగా ‘స్పేస్‌ టెక్నాలజీ’పై ప్రాజెక్టులను ఆహ్వానించాయి. దేశ వ్యాప్తంగా 32 రాష్ట్రాల నుంచి 6,500 మంది విద్యార్థులు 2,500 ప్రాజెక్టులను  రూపొందించి పంపించారు. అందులో 75 అత్యుత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. అందులో బాలయోగి గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కె.చిన్నమ్మి, ఆర్‌.పూజిత, డి.లావణ్యలు తయారుచేసిన 3డీ ప్రజ్ఞాన్‌రోవర్‌ (అంతరిక్షంలో సమస్యల నేపథ్యం, వాటి పరిష్కారం, చంద్రయాన్‌-2 సాంకేతికతపై రూపొందించిన) ప్రాజెక్ట్‌ చోటు దక్కించుకుంది.  జాతీయస్థాయిలో 15వ స్థానం సాధించింది. రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం పొందింది.  నీతి ఆయోగ్‌ నుంచి శుక్రవారం సమాచారం వచ్చినట్టు పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎ.రాణిశ్రీ ధ్రువీకరించారు. రాష్ట్రం నుంచి ప్రకాశం, విశాఖ జిల్లాల నుంచి ఒక్కో పాఠశాల విద్యార్థులతో పాటు నెల్లిమర్ల బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థినుల ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. అటు జాతీయ స్థాయిలో 15వ స్థానం, ఇటు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కడం గొప్ప విషయమని సాంఘిక సంక్షేమ శాఖ డీసీవో చంద్రావతి అన్నారు. విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విషయంలో కృషిచేసిన ప్రిన్సిపాల్‌ రాణిశ్రీ, ల్యాబ్‌ ఇన్‌చార్జి గౌరమ్మలతో పాటు ఇతర ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. విద్యార్థినులకు సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 




Updated Date - 2022-01-22T04:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising