ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్వరాలపై ఇంటింటి సర్వే

ABN, First Publish Date - 2022-07-03T05:25:31+05:30

పార్వతీపురం మన్యం జిల్లాలోని గ్రామాల్లో జ్వర పీడితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.జగన్నాథరావు తెలిపారు.

సీసాడవలసలో గ్రామస్థులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  డీఎంహెచ్‌వో జగన్నాథరావు

కొమరాడ, జూలై 2 : పార్వతీపురం మన్యం జిల్లాలోని గ్రామాల్లో జ్వర పీడితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.జగన్నాథరావు తెలిపారు. శనివారం కొమరాడ మండలంలోని చినఖేర్జిల, సీసాడవలస గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జ్వర పీడితుల పరిస్థితిపై సమీక్షించారు.  సిబ్బంది ఇంటింటికి వెళ్లి రోగుల పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశించారు. వర్షాలు  కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.  గ్రామాల్లో అవసరమైన మేరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.   పారిశుధ్యం లోపించకుండా చూడాలన్నారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.  ప్రతి 15 రోజులకొకసారి రక్షిత నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌  చేయించాలన్నారు. ప్రజలు వేడి నీటిని తాగడంతో పాటు దోమ తెరలను వినియోగించాలని, వేడి వేడి ఆహార పదార్థాలనే తినాలని సూచించారు. ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలు దోమ తెరలు వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. వారంలో ఒకరోజు డ్రై డే పాటించాలని కోరారు.


Updated Date - 2022-07-03T05:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising