ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల్లో అ‘భూత’ కల్పన

ABN, First Publish Date - 2022-07-02T05:39:01+05:30

గిరిజనుల్లో అ‘భూత’ కల్పన

బొడ్డవర సమీపంలో క్షుద్రపూజలు చేస్తున్న భూతవైద్యుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దెయ్యం వదిలిస్తానని మూడు రోజులుగా క్షుద్ర పూజలు

- బొడ్డవరలో వెలుగుచూసిన వైనం

శృంగవరపుకోట రూరల్‌: ఆధునిక ప్రపంచంలో కూడా గిరిజనులు మూఢ నమ్మకాలను వదలడం లేదు. ఎవరో చెప్పిన అభూత కల్పన మాటలనే నమ్ముతు న్నారు. శృంగవరపు కోట మండలం బొడ్డవర మైదాన ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెను కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. వేల రూపాయలు ఖర్చు చేసినా ఆరోగ్యం కుదట పడలేదు. ఇక లాభం లేదనుకొని తమ కులపెద్దలు అల్లూరి సీతారామరాజు (పాడేరు) జిల్లాలో ఒక మారుమూల గ్రామానికి చెందిన ఓ భూత వైద్యుడిని రప్పించారు. అతను ఆ మహిళను చూసి దెయ్యం పట్టిందని, వదలించాలని చెప్పాడు. గత మూడురోజులుగా సదరు మహిళను ఒక చెరువు సమీపంలోకి తీసుకెళ్లి క్షుద్ర పూజలు చేయిస్తున్నాడు. దీంతో ఆ మహిళ ఆరోగ్యం బాగుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సైన్స్‌ ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇంకా ఇటువంటి భూత వైద్యాలు కొనసాగడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-07-02T05:39:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising