ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 నుంచి సమ్మెటివ్‌-1 పరీక్షలు

ABN, First Publish Date - 2022-12-31T00:31:24+05:30

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతులకు వచ్చేనెల నాలుగో తేదీ నుంచి పదో తేదీ వరకు సమ్మెటివ్‌-1 పరీక్షలు నిర్వహించనున్నారు.

గరుగుబిల్లి ఎమ్మార్సీ భవనంలో ప్రశ్నా పత్రాలను సిద్ధం చేస్తున్న సీఆర్‌పీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి, డిసెంబరు 30 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతులకు వచ్చేనెల నాలుగో తేదీ నుంచి పదో తేదీ వరకు సమ్మెటివ్‌-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం గరుగుబిల్లి ఎమ్మార్సీ కేంద్రాల్లో క్లస్టర్ల రిసోర్స్‌పర్సన్లు ప్రశ్నా పత్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రశ్నా పత్రాలను ఒక రోజు ముందుగా సంబంధిత ఎమ్మార్సీ భవనం నుంచి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు 6, 7, 10 తరగతులకు 4న తెలుగు, 5న హిందీ, 6న ఇంగ్లీషు, 7న లెక్కలు, 9న జనరల్‌ సైన్స్‌, 11న సోషల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 8వ తరగతికి సంబంధించి 4న తెలుగు, 5న హిందీ, 6న ఇంగ్లీషు, 7న సోషల్‌, 9న జనరల్‌ సైన్స్‌, 10న లెక్కలు పరీక్షలు నిర్వహించనున్నారు. లెక్కలు, జనరల్‌ సైన్స్‌ పరీక్షా పత్రాలను ఒకే మాదిరిగా కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేర్వేరుగా అందించనున్నారు. 6 నుంచి 10వ తరగతులకు ప్రశ్న పత్రాలను సబ్జెక్టుల వారీగా అందించనున్నారు. ఓఎంఆర్‌ షీట్లును దూరంగా ఉంచారు. 6, 8, 10వ తరగతులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, 7, 9 తరగతులకు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Updated Date - 2022-12-31T00:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising