ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka Murder Case : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం నోటీసులు

ABN, First Publish Date - 2022-10-17T18:19:42+05:30

ఎర్ర గంగిరెడ్డి (Erra Gangireddy)కి సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14 లోగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi : ఎర్ర గంగిరెడ్డి (Erra Gangireddy)కి సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14 లోగా సీబీఐ (CBI) పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎం. ఆర్. షా, ఎం.ఎం. సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. సీబీఐ విచారణాధికారులనే గంగిరెడ్డి బెదిరిస్తున్నారన్న సీబీఐ వాదనను సుప్రీం ధర్మాసనం సీరియస్‌గా తీసుకుంది. సాక్ష్యులను కూడా ప్రభావితం చేస్తున్నారని సీబీఐ తెలిపింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని వెల్లడించింది. సాక్షులను రక్షించుకోవాలంటే ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తప్పక రద్దు చేయాల్సిందేనని సీబీఐ వాదించింది. తదుపరి విచారణను నవంబర్ 14కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.  


Updated Date - 2022-10-17T18:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising