ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసు నిందితుల చంపేందుకు కుట్ర: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-02-12T21:32:27+05:30

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్‌గా ఉన్న వరుణ్‌రెడ్డిని.. ఇప్పుడు కడప జైలర్‌గా నియమించారని తెలిపారు. దీనిపై సీబీఐకి లేఖ రాస్తామని, కడప జైల్లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణహానీ ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.


మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. ఇటీవల పులివెందుల కోర్టులో ఈ మేరకు రెండో ప్రాథమిక చార్జిషీటును దాఖలు చేసింది. 2019 మార్చి 15న వివేకా తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తన తండ్రి హత్య కేసులో సిట్‌ విచారణలో పురోగతి లేదని, సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివే కా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2022-02-12T21:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising