ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకమైన ఉద్యోగులు.. విశాఖ జిల్లాలో ఉధృతమైన ఆందోళనలు

ABN, First Publish Date - 2022-01-24T00:02:10+05:30

జిల్లా స్థాయిలోనూ ఉద్యోగ జేఏసీల నేతలు ఏకమయ్యారు. ఎన్జీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పీఆర్సీ సాధన సమితిగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జిల్లా స్థాయిలోనూ ఉద్యోగ జేఏసీల నేతలు ఏకమయ్యారు. ఎన్జీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పీఆర్సీ సాధన సమితిగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సాధన సమితి కన్వీనర్ ఈశ్వర్రావు మాట్లాడుతూ ఈనెల 25‎న బైక్ ర్యాలీతో నగరమంతా నిరసన చేపడతామన్నారు. ఫిబ్రవరి 3న ఛలో విజయవాడకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. 


తమ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి మద్దతు కూడగట్టుకుంటామన్నారు. ఫిబ్రవరి 7న మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అందుకు ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చిచెప్పారు. ఫిట్‌మెంట్ సీఎం స్థాయిలోనే పరిష్కారం కావాలని చెప్పారు.


‘‘ఉద్యోగుల ఆశల్ని జగన్‌‌ అడిఆశలు  చేశారు. ఐఆర్ 27 శాతం ఇస్తామని నమ్మించి జగన్ మోసం చేశారు. ఐఆర్ ఇచ్చినట్లే ఇచ్చి ఫిట్‎మెంట్ 23 శాతానికి పరిమితం చేశారు.  పెండింగ్ డీఏ కలిపి జీతాలు పెంచుతున్నామని చెప్పడం మోసపూరితం. అసుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బైట పెట్టాలి.’’ అని ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-24T00:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising