ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 50,656 మందికి చేయూత

ABN, First Publish Date - 2022-09-24T06:50:43+05:30

చేయూత పథకం మూడో విడత కింద జిల్లాలో 50,656 మంది లబ్ధిదారులకు రూ.94.98 కోట్లు విడుదల అయ్యాయని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తెలిపారు.

చేయూత సొమ్ము నమూనా చెక్కును ప్రదర్శిస్తున్న ఎంపీ మాధవి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ, ట్రైకార్‌ చైర్మన్‌ బుల్లిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


లబ్ధిదారుల ఖాతాల్లో రూ.94.98 కోట్లు జమ


పాడేరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): చేయూత పథకం మూడో విడత కింద జిల్లాలో 50,656 మంది లబ్ధిదారులకు రూ.94.98 కోట్లు విడుదల అయ్యాయని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తెలిపారు. సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం కుప్పంలో ‘చేయూత’ సొమ్ము జమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో ఆయనతోపాటు అరకులోయ ఎంపీ జి.మాధవి, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ట్రైకార్‌ చైర్మన్‌ సతకా బుల్లిబాబు, తదితరులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం చేయూత సొమ్ము నమూనా చెక్కును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ జి.మాధవి మాట్లాడుతూ, చేయూత సొమ్మును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T06:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising