ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమలులో యువత కీలకం కావాలి

ABN, First Publish Date - 2022-08-11T06:45:58+05:30

ప్రభుత్వ పథకాల అమలులో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు జి.డైసీ అన్నారు.

నెహ్రూచౌక్‌ జంక్షన్‌ వద్ద జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తున్న డైసీ, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు డైసీ


తుమ్మపాల, ఆగస్టు 10 : ప్రభుత్వ పథకాల అమలులో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు జి.డైసీ  అన్నారు.  కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ‘యువజన సంఘాల బలోపేతం’ అంశంపై బుధవారం అనకాపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు.  సంక్షేమ పథకాలు అర్హులకు దక్కేలా యువత కృషి చేయాలన్నారు. వ్యక్తిగత వికాసం, కుటుంబ, సంఘ, సమాజ పరిపూర్ణ వికాసం కోసం ఆయా ప్రభుత్వ శాఖలు కృషి చేస్తున్నట్టు చెప్పారు. యుక్త వయస్సు నుంచే సామాజికంగా ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని సూచించారు.  అనంతరం జాతీయ జెండాలతో మెయిన్‌ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ జిల్లా అధికారి జి.మహేశ్వరరావు,  ఎంపీపీ గొర్లి సూరిబాబు, నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ, ఎంపీడీవో డి.చంద్రశేఖర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-11T06:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising