ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడి

ABN, First Publish Date - 2022-06-26T06:17:42+05:30

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడి సాధ్యమని జిల్లా పంచాయతీ అధికారిణి ఆర్‌.శిరీషారాణి పేర్కొన్నారు.

మాట్లాడుతున్న శిరీషారాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా పంచాయతీ అధికారిణి ఆర్‌.శిరీషారాణి


తుమ్మపాల, జూన్‌  25: ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడి సాధ్యమని జిల్లా పంచాయతీ అధికారిణి ఆర్‌.శిరీషారాణి పేర్కొన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్‌ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై సర్పంచ్‌లకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులకు అలవాటుపడి రైతులు అనారోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేస్తుండడంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆర్థికాభివృద్ధితో పాటు నాణ్యమైన పంటల దిగుబడి లభిస్తుందన్నారు. ఇలాపండించిన పంటలను తిరుమల తిరుపతి దేవస్థానానికి విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జడ్పీ సీఈవో ఎం.విజయ్‌కుమార్‌  ప్రకృతి వ్యవసాయం ద్వారా కలిగే లాభాలను వివరించాలని సూచించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుందన్నారు. ట్రైనీలు సేంద్రియ ఎరువుల వాడకం, ఘన జీవామృతం తయారీ, విత్తనశుద్ధి తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ సాగుతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రేబాక గ్రామ మహిళా రైతు బొడ్డేడ విజయలక్ష్మిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యశ్రీనివాస్‌, ఈవోపీఆర్డీ ఆంజనేయులు, ఉద్యానవనశాఖ అధికారిణి టి.అనిత, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T06:17:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising