ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబ సభ్యుల చెంతకు పశ్చిమబెంగాల్‌ మహిళ

ABN, First Publish Date - 2022-01-24T06:26:54+05:30

టీఎస్సార్‌ కాంప్లెక్స్‌లోని ఏయూ టీడీ, నిరాశ్రయుల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న పార్వతి (48) అనే మహిళను ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు, వసతి గృహం మేనేజర్‌ కె.జ్యోతిర్మయి తెలిపారు.

బెంగాల్‌ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులతో పార్వతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పదిహేనేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి విశాఖకు

ఆర్టీసీ కాంప్లెక్‌ వద్ద తిరుగుతుండగా ఏయూటీడీలో ఆశ్రయం

కోలుకోవడంతో కుటుంబ సభ్యుల గుర్తింపు

విశాఖపట్నం, జనవరి 23 : టీఎస్సార్‌ కాంప్లెక్స్‌లోని ఏయూ టీడీ, నిరాశ్రయుల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న పార్వతి (48) అనే మహిళను ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు, వసతి గృహం మేనేజర్‌ కె.జ్యోతిర్మయి తెలిపారు. మతిస్థిమితం లేని పార్వతి 2015లో ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో తిరుగుతుండగా చేరదీశామని, చికిత్స చేయించడంతో కోలుకుందన్నారు.


 గతం గుర్తుకు వచ్చినప్పుడల్లా భర్త పేరు నేపాల మిస్బా అని, తర్వాత ఊరు, కుటుంబ సభ్యుల వివరాలు తెలిపిందన్నారు. ఆమె కుటుం బం పశ్చిమబెంగాల్‌లోని బర్దమాన్‌ జిల్లాలోని హట్‌గోబింద్‌పూర్‌ గ్రామంలో ఉందని తెలు సుకుని వారికి సమాచారం అందించామని, చనిపోయిందనుకున్న పార్వతి పదిహేనేళ్ల తర్వాత తిరిగి చేరడంతో కుటుంబ సభ్యులు ఆనందపరవశులయ్యారని తెలిపారు. పార్వతి కుటుంబ సభ్యులు ఏయూటీడీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-01-24T06:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising