ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN, First Publish Date - 2022-06-28T05:35:11+05:30

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ అన్నారు.

ప్లీనరీలో మాట్లాడుతున్న అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మశ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మశ్రీ

నర్సీపట్నం అర్బన్‌, జూన్‌ 27: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ అన్నారు. సోమవారం నర్సీపట్నం ఎన్టీఆర్‌ స్టేడియంలో నియోజకవర్గ ప్లీనరీని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన ధర్మశ్రీ మాట్లాడుతూ.. ఇటీవల చోడవరంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు మాయల మహానాడుగా అభివర్ణించారు. చంద్రబాబు మెప్పు కోసం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి దేశంలోనే ప్రతి ఒక్కరూ మన రాష్ట్రం గురించి మాట్లాడుకునే విధంగా జగన్మోహన్‌రెడ్డి తీర్చిదిద్దారన్నారు. స్థానిక ఎమ్మెల్యే గణేశ్‌ మాట్లాడుతూ.. అయ్యన్నపై ప్రభుత్వం పెట్టిన 11 కేసులకు ఆయన నోటి దురుసే కారణమన్నారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు అయ్యన్న చేస్తే తాము దీటుగా స్పందిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అనకాపల్లి పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, డీసీసీబీ చైర్‌పర్సన్‌ సీహెచ్‌. అనిత, మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ సీహెచ్‌. సన్యాసిపాత్రుడు, మునిసిపల్‌ చైర్మన్‌  ఆదిలక్ష్మి, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:35:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising