ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తుల మదింపు ప్రక్రియను అడ్డుకుంటాం

ABN, First Publish Date - 2022-05-18T06:39:06+05:30

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆస్తుల మదింపునకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రక్రియను అడ్డుకుంటామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సీహెచ్‌.నరసింగరావు అన్నారు.

ధర్నాలో మాట్లాడుతున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ సీహెచ్‌.నరసింగరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సీహెచ్‌.నరసింగరావు

ఉక్కుటౌన్‌షిప్‌, మే 17: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆస్తుల మదింపునకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రక్రియను అడ్డుకుంటామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సీహెచ్‌.నరసింగరావు అన్నారు. ప్లాంట్‌ ఆస్తుల మదింపు ప్రక్రియకు నిరసనగా మంగళవారం ప్లాంట్‌ టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(టీటీఐ) వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాంట్‌ను విక్రయించాలనే క్రమంలో నియమించిన ట్రాన్సాక్షన్‌, లీగల్‌ అడ్వైజరీ కమిటీలు  ఇక్కడకు రాకుండా అడ్డుకున్నామని వివరించారు. మరో చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ మదింపు కమిటీల్లో ప్లాంట్‌ సీఎండీ, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)లను ఆహ్వానితులుగా పేర్కొనటం దుర్మార్గమన్నారు. ప్లాంట్‌లోకి ఎవరినీ అడుగు పెట్టనివ్వమన్నారు. పోరాట కమిటీ మరో చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన ప్లాంట్‌ను రక్షించుకుంటామని, ప్లాంట్‌ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. అనంతరం సీఎండీ అతుల్‌భట్‌తో సమావేశమై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, కో-కన్వీనర్‌లు కేఎస్‌ఎన్‌ రావు, గంధం వెంకటరావు, నాయకులు పాడి త్రినాథ్‌, దొమ్మేటి అప్పారావు, విళ్లా రామ్మోహన్‌కుమార్‌, డీవీ రమణారెడ్డి, వరసాల శ్రీనివాసరావు, సురేశ్‌బాబు, కామేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-18T06:39:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising