ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముడసర్లోవకు రక్షణ

ABN, First Publish Date - 2022-05-18T07:12:19+05:30

ఆక్రమణలతో రోజురోజుకీ బక్కచిక్కిపోతున్న ముడసర్లోవ రిజర్వాయర్‌ పరిరక్షణకు మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు చర్యలు ప్రారంభించారు.

ముడసర్లోవ రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిజర్వాయర్‌, పరీవాహక ప్రాంతం చుట్టూ గోడ

వర్షం నీరు జలాశయంలోకి వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిర్మాణం

ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకే... రూ. పది కోట్లతో ప్రతిపాదనలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఆక్రమణలతో రోజురోజుకీ బక్కచిక్కిపోతున్న ముడసర్లోవ రిజర్వాయర్‌ పరిరక్షణకు మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు చర్యలు ప్రారంభించారు. రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణలను నియంత్రించేందుకు చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. దీనికోసం రూ.10 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. 

ముడసర్లోవ రిజర్వాయర్‌, పరీవాహక ప్రాంతం ఇటు బీఆర్‌టీఎస్‌ రోడ్డు నుంచి అటు కంబాలకొండ వరకూ  సుమారు 800 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. బీఆర్‌టీఎస్‌ రోడ్డు నిర్మించిన తర్వాత రిజర్వాయర్‌ ప్రాంతంలో ఆక్రమణలు మొదలయ్యాయి. వర్షాలు కురిసినప్పుడు కొండల పైనుంచి వచ్చే నీరు రిజర్వాయర్‌లో కలిసేందుకు వీలుగా ఏర్పడిన కాలువలను ఆక్రమణదారులు కప్పేసి నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. అలాగే కంబాలకొండ, పెందుర్తి వైపు నుంచి వర్షం నీరు వచ్చేందుకు వీలుగా ఉన్న కాలువను కూడా కప్పేయడంతో రిజర్వాయర్‌కు నీటి చేరిక తగ్గిపోయింది. అలాగే బీఆర్‌టీఎస్‌ను ఆనుకుని రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతాన్ని కొంతమంది రాజకీయ నేతలు, స్థానిక నేతలు ఆక్రమించేసి ప్లాట్లుగా విభజించి విక్రయించేయడంతో సుమారు 200 వరకూ అక్రమ వెలిశాయి. ఇటీవల వైసీపీ నేత అండతో కొంతమంది శాశ్వత నిర్మాణాలు ప్రారంభించగా జీవీఎంసీ అధికారులు అడ్డుకుని, వాటిని కూల్చేశారు. కానీ వైసీపీ నేత అండదండలు అందించడంతో తిరిగి షెడ్లు నిర్మించేసుకున్నారు. తరచూ ఆక్రమణదారుల నుంచి బెడద ఎదురవుతుండడంతో ముడసర్లోవ రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతం చుట్టూ రక్షణ గోడ (వర్షం నీరు రిజర్వాయర్‌లోకి వెళ్లేలా వెసులుబాటు కల్పిస్తూ) నిర్మించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. దీనికోసం ఇంజనీరింగ్‌ అధికారులు సర్వే చేసి రూ.పది కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కమిషనర్‌ లక్ష్మీషా దీనికి సమ్మతించడంతో ఇటీవలే టెండర్లు కూడా పిలిచారు. రూ.పది కోట్ల విలువైన పని కాబట్టి, కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరి కావడంతో ఈనెల 26న జరిగే కౌన్సిల్‌లో ఈ అంశాన్ని అజెండాలో చేర్చారు. రక్షణ గోడ నిర్మాణం జరిగితే ఆక్రమణలకు తెరపడడంతో పాటు ముడసర్లోవ రిజర్వాయర్‌ను పరిరక్షించినట్టు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-05-18T07:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising