ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్‌ఏల వేతనం రూ.21 వేలకు పెంచాలి

ABN, First Publish Date - 2022-03-03T06:29:40+05:30

వీఆర్‌ఏల వేతనం రూ.21 వేలకు పెంచాలి

ర్యాలీ నిర్వహిస్తున్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు డిమాండ్‌

పాడేరులో నిరసన ర్యాలీ

పాడేరు, మార్చి 2: గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్‌ ఏలు) నెలకు రూ.21 వేలు వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు బుధవారం ఎంపీడీవో కార్యాలయం నుంచి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ, నిబద్ధతతో కష్టపడి విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, వారి సమస్యల పరిష్కారానికి కనీస శ్రద్ధ చూపకపోవడం శోచనీయమని అన్నారు. వేతనం రూ.21 వేలకు పెంచడంతోపాటు టీఏ, డీఏలు ఇవ్వాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏల డివిజన్‌ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శేఖర్‌, కొండబాబు, సభ్యులు సింహాచలం, మోహన్‌, నీలకంఠం, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-03T06:29:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising