ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ముత్తంశెట్టి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు

ABN, First Publish Date - 2022-01-28T21:45:41+05:30

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సొంత నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ జిల్లా: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సొంత నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. 26 జిల్లాల విభజన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని మంత్రి ముత్తం శెట్టి ఆదేశించారు. దీంతో తగరపువలస ప్రధాన కూడలిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహిస్తున్న క్రమంలో నాయకుల మధ్య విభేదాలు భగ్గమన్నాయి భీమిలి పట్టణ వైసీపీ ప్రధాన కార్యదర్శి వెంకట రెడ్డిని కార్యక్రమాలకు రావద్దని వైసీపీ నేతలు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రెండు వర్గాల కార్యకర్తలు కొట్టుకున్నంత పని చేశారు. భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్, మంత్రి సోదరుడు ముత్తంశెట్టి మహేష్, వైసీపీ నాయకుల మధ్య అంతర్గత కలహాలు సర్దుబాటు చేయడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. బహిరంగ సమావేశాల్లో మాత్రమే నాయకులు కార్యకర్తలను కలుపుకుని వెళుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిగతా సమయంలో ఎవరూ పట్టించుకోవడంలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా జిల్లాల విభజన వైసీపీ నాయకుల మధ్య దాగి ఉన్న అంతర్గత కలహాలు మరోసారి బహిర్గతమయ్యాయి.

Updated Date - 2022-01-28T21:45:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising